Shaktipatamu    Chapters    Last Page

శక్తి పాతము

ప్రథమ భాగము

ఆధ్యాత్మిక విద్యలు - ఆధిభౌతిక విద్యలు.

శక్తి పాత మొక యాధ్యాత్మిక ప్రక్రియ. దీనివలన గురువు తన శక్తిని శిష్యునియందుఁ బ్రవేశ##పెట్టి యాతని యాధ్యాత్మిక శక్తిని మేలుకొల్పును. ఆధ్యాత్మిక శక్తికిని, నాధిభౌతిక శక్తికిని జాల భేదమున్నది. కనుకనే యాధ్యాత్మిక శక్తి వల్ల నగు జ్ఞాన మాధిభౌతిక శక్తి వల్ల నగుదానికంటె వేఱగుట స్వాభావికము కాని యాధ్యాత్మికశక్తి భౌతిక కేంద్రములవలనఁ బ్రదర్శితము కాదు. అందువలన నీజ్ఞానము నేఁటికిని గుప్తముగానే యున్నది. దీని ననుభవించువారు తమ సచేతనశరీరముల తోడనే యనుభవించెదరు. వారు దీని చేఁగలుగు నానందము వలన మైరుఱతురు. పైనఁ జెప్పినవిజ్ఞాన మతిసూక్ష్మ మగుటవలన బోధపడదు. కాన వారు దానివలనఁ గలుగు ననుభవములను వర్ణించుటమాత్రముతోనే సంతసించెదరు కాని పాశ్చాత్యభౌతిక వైజ్ఞానికుల యన్వేషణ ప్రణాలికలం జూచి యాధునికయుగ 'మింతమాత్రము చాలు' ననుకొనుట తగదు. ఆధిభౌతికవిద్యల సూక్ష్మాతిసూక్ష్మ తత్త్వాన్వేషణము చేయుటకుఁ బశ్చిమదేశ విద్వాంసులు కోటుల కొలఁది ధనమును వెచ్చఁబెట్టి యనర్థకరమైన యంత్రములను నిర్మించి వానివలన నతిసూక్ష్మ విషయములను సాధించుటకును, వానిని గణితశాస్త్రసహాయముచే నభివృద్ధి చేయుటకును బ్రయత్నించుచున్నారనుట నిర్వివాదము. కాని యాధ్యాత్మిక విద్యను బొందుటకు నే యంత్రసహాయము నక్కఱయు లేదు. భగవంతునిచే రచింపబడిన మావదేహమే యంత్రముగను, బ్రయోగ శాలగను బనిచేయుచున్నది. భావియుగవిద్వాంసు లాధ్యాత్మిక శక్తి నియమములను సహిత మాధిభౌతిక నియమము లనువలె గణిత శాస్త్రసూత్రములతో ముడిపెట్టఁగలరని చెప్పఁజాలము. కాని, యిప్పటి కది యసంభవ మనియే తోఁచును. మహర్షులు మనకై విడచిన విద్యాసంపత్కోశ స్వరూపములైన 'పతంజలిదర్శనము' మున్నగు ననేక శాస్త్రములందు నాధ్యాత్మికోన్నతిని, మోక్షమార్గమునుగూర్చియుఁ దెలియఁజేయుచుఁ గొన్ని భౌతిక సిద్ధులను వర్ణించిరి. పతంజలిదర్శన శాస్త్రమున విభూతిపాదమందుఁ గొన్ని యత్యున్నతములైన సిద్ధులను బొందుటకైన యుపాయములు కానవచ్చును. వానిని వైజ్ఞానిక దృష్టితోఁ జూచినచో వానిలోఁ బ్రత్యేకసూత్రమందును, లోతు తెలియని వైజ్ఞానికరహస్యములు కలవు. కాని వానిని దెలిసికొనుటకు నొక్కింత సమాధ్యవస్థాలాభ మావశ్యకము. అది యటులుండనిండు.
శక్తిపాత మను నీగ్రంథమందు గురువులు శిష్యలకు సంక్రమింపఁజేయు నాధ్యాత్మిక శక్తి స్వరూప మెట్టిది? అది యెక్కడ నే విధముగాఁబుట్టును? శిష్యుని శరీరమం దది యెటులు పడవేయఁబడును? అది శరీరమునుండి యెటులు వెలికివచ్చి పోవుచుండును? శిష్యుని శరీరమందుఁ బ్రవేశించి యేమి చేయును? దాని వికాసము శరీరమందును మనస్సు నందును నేవిధముగా నగును? దానివలన నెట్టి యనుభవములు మనుష్యున కగును? ఆ యనుభవములు వికసించుటకుఁ గారణ మేమి? ఈ యన్నిఁటి తుది పరిణామ మెట్టిది? ఈ మున్నగు విషయములను జర్చించు ప్రయత్నమే చేయుదము. ఏలనగా దాని నభ్యసించు వారియు, తక్కువిద్వాంసులయు దృష్టి నాకర్షించుటకే.
ఆధిభౌతికాధ్యాత్మికవిద్యల లక్షణమేమనఁగా వాని నొందం గోరువారికి రెండును సమానమగు నానందము నిచ్చునవియై యుండవలయును. భౌతిక విజ్ఞానమును జూడగా నది నేఁడు లోకమునఁ గొండకొన లెక్కిపోయినది. కాని ''యాధిభౌతిక విజ్ఞానోన్నతి పూర్తిగా దురుపయుక్త మగుచున్నది'' యనునది మాత్రము సత్యము. మఱియు స్వార్థపరములైన కొన్ని వ్యక్తులును, బ్రతిభావంతములైన కొన్ని జాతులును భౌతికవిద్యోన్నతికై కోటులకొలఁది ధనమును వెచ్చించి వైజ్ఞానిక విద్వాంసులకు సహాయము చేయుచున్నవి, వారి పరిశ్రమము సార్వజనిక కల్యాణమునకై కాదు సరికదా, తమ స్వార్థము నెఱవేఱుటకే యుపయోగపడుచున్నది. అంతేకాక; వైజ్ఞానికోన్నతుల దుష్పరిమాణము లోకమున రుద్రసంహారమువఱకు సాగిపోవుచున్నది. నేఁటి దారిద్ర్యము, బహువిధసంతాపము మున్నగు వాని హేతువు సైతము విద్యల దురుపయోగమే. కావున మానవుఁడు క్షణికానందమునకై పైవిద్యలవల్లనగు సిద్ధిలోభ మునఁ జిక్కుకొని లోకమునకు నపకారముచేయు నిక్కాలమున మనము పుట్టితిమి. భావిభారతీయసంతానము తన పూర్వులవలన లాభమునంది ప్రపంచమునకు నుపకారము కూడఁ జేయవచ్చును. కాని, యాధ్యాత్మికోన్నతియందు నిట్టి భయము కలుగునని సంశయింపఁ బనిలేదు.
కావున నాధ్యాత్మిక విద్యను బొందఁగోరువారి యుపయోగమునకై యాధ్యాత్మికోన్నతియందు ముఖ్యసాధనమైన శక్తిపాతము దిగువ వర్ణింపఁబడును.
శక్తిపాత వివరణము
ఇటనుండి శక్తిపాత వ్యాఖ్యానమును జేయుదము. శక్తి పాతదీక్షను గ్రహించుటకై యెట్టి పూర్వసాధనమును, శాస్త్రాధ్యయనమును నక్కఱలేదు. గురువు ననుగ్రహమె కలిగిన యెడ మున్నెట్టి ప్రయత్నమునందును సిద్ధుఁడు కాకున్నను, వాఁడు సర్వశాస్త్రములయందును విద్వాంసుఁడే కానీ, చదువరియే కాకపోనీ - యాగానుష్ఠానపరుండే కానీ, కాకపోనీ - గురుశక్తి పాత మనెడి ప్రయత్నమువలన శిష్యునియందలి శక్తి యుద్బుద్ధ మగును. కాని యిచ్చట శక్తి పాతమును వ్యాఖ్యానించు నుద్దేశ మిదికాదు. భౌతికవిజ్ఞాన సంపాదనమునకై దానికి సంబంధించిన కొంత విజ్ఞానమును గలిగించెడి గురువు మున్నొకఁ డుండి యుండవలయును. దీని కటులు కాదు.
'శక్తి పాత' మనెడి యీ సాధనమునం దధికారిశిష్యుని యందు 'యోగము, భక్తి, బ్రహ్మాత్మైక్యజ్ఞానము. గురువు ననుగ్రహమువలన హఠాత్తుగా జాగరితము లగును. మహర్షి పతంజలి మనోవృత్తులను నిరోధించుట కెనిమిది సాధనములను జెప్పెను. ఆ యెనిమిది సాధనములలోనే వృత్తిని నిరోధించు సమస్త సాధనములును గలవు. దానిననుసరించి యీ సాధనము దిగువఁ జెప్పఁబడు నా యెనిమిది సాధనములందే గలదు. శక్తిపాత దీక్షకు నధికారి యగుటకుఁ దొల్లింటి సత్కర్మములు గానీ, యంతఃకరణశుద్ధికై చెప్పిన సాధనములుగానీ చేసి యుండవలయును. ఇది మున్ముందుఁ జెప్పఁబడును.
చిత్తవృత్తి నిరోధ సాధనములు.
చిత్తవృత్తి నిరోధమునకై పతంజలిచేఁ జెప్పఁబడిన యెనిమిది సాధనములు నివి.
1. అభ్యాసము చేతను, వైరాగ్యముచేతను జిత్తవృత్తుల నిరోధ మగును. ఈ యన్నింటిలో నీ రెండే ముఖ్యములు ఏలనఁగా నభ్యాసములేక యెవ్వరును సాధనము చేయలేరు. అభ్యాసమును దృఢము చేసికొనుటకుఁ బ్రాపంచిక విషయములనుండియు, స్వర్గము - యోగము మొదలగు సిద్ధుల ప్రలోభములనుండియుఁ దాను దప్పుకొనుటకు వైరాగ్యము సదాయావశ్యకము. వైరాగ్యమున కర్ధము త్యాగము కాదు. ఎందువల్ల ననఁగా - సుఖదుఃఖముల ననుభవించుటకే జన్మము కలుగును. కాని, వైరాగ్యమన నాసక్తి లేకపోవుట యను నర్థమునే తీసికొనఁ దగును. రాగద్వేషములను వీడి ప్రపంచము నందలి యన్ని భోగములను, ధర్మయుక్తముగా ననుభవించు వారే విరక్తులఁబడుదురు. ఇచట రెండు మాటలు, అభ్యాసమనగా - 'అస్‌ - క్షేపణ' యను ధాతువునుబట్టి 'చిమ్ముట' యని యర్థము. 'అభి
+అస్‌ = అభ్యస్‌ = అభిముఖముగా, అభితః. పూర్తిగా జిమ్ముట. 'శరాసనము. = బాణములను జిమ్మునది. ఈ మాట 'అస్‌' ధాతువునుండియే నిష్పన్నమైనది.
శ్లో|| 'అభ్యస్య సే సునియతేంద్రియ తత్త్వసారైః'
దేవీమాహాత్మ్యము, మార్కండేయ పురాణము.
శ్లో|| ప్రణవం చ ధనుః కృ త్వా, శర మాత్మానమేవచ |
బ్రహ్మ లక్ష్యం చ వేద్ధవ్య మప్రమత్తేన చేతసా ||
ఏతన్మహావ్రతం విద్యాత్‌ ||
--ఉపనిషత్తు.
ప్రణవమును ధనుస్సుగాను, ఆత్మను (నేనును) శరముగాను, జేసి ప్రమాదములేని చిత్తముతో వేధింపవలయును. అనగా నేనును గురియైన బ్రహ్మమునందు విశ్రాంతి (ఏమరుపాటు) లేక చొచ్చునట్లు చిమ్మవలయును. అనగాఁ నున్నది బ్రహ్మమేకాని, వేఱుగా 'నేను' అనునది లేదనెడి నిష్ఫాలనము కలుగవలయును. 'బ్రహ్మాహమస్మి' యనెడి మహావాక్యార్థ మును విడువక స్మరించుచుండుటే యభ్యాసమనియు, నదే మహావ్రత మనియు నర్థము. కనుక నభ్యాస మనుచోట 'నలవా' టని చెప్పక పైనఁ జెప్పిన యర్థమునే చెప్పికొనవలయును. ఈ యభ్యాసఫలముగా వైరాగ్యము, విషయములందనాసక్తి యప్రయత్నముగా ననాయసముగాఁ గుదురును. 'అభ్యాస వైరాగ్యాభ్యాం' అనుచోట నభ్యాసమువల్లను, దానిచే నగు వైరాగ్యమువల్ల ననుటయే సమంజస మని నా యభిప్రాయము. ''బ్రహ్మహ మస్మి; శివో
హం; సాహం, తత్త్వమసి'' - మున్నగు మహావాక్యార్థములం'' దీ 'నేను' ప్రతిష్ఠితమై, యనఁగా; దన సచ్చిదానంద స్వరూపానుభూతి నొందు నవస్థయే సమాధ్యవస్థ. ఈ యవస్థనే గీతాగురుఁడు 'సమాహితస్థితి, సమాధి' యనెను. ఈ యవస్థ యెంతగాఁ గలిగిన నంతగాఁ జిత్తవృత్తులు నిరోధింపఁబడుచుండును. ప్రాణాయామ హఠాది కఠిన ప్రయత్నముల చేతఁ దాత్కాలికముగా నల్పమాత్రకాలమే యగుదుండును. దీని విపులవ్యాఖ్యానము గూర్చి నా వ్రాసిన 'సోహంసమాధి' యను గ్రంథమును గాని, 'సాధన సామగ్రి' (మొదటిమూట) యందుఁ గాని, చూచునది.
2. ఈశ్వరునియందుఁ బ్రణిధాన మనుదానివలన సహితము వృత్తినిరోధము కలుగును. ఈశ్వరప్రణిధాన మనఁగా సర్వము నీశ్వరునియం దర్పించుట లేక శరణాగతి (ఈశ్వరుని శరణు పొందుట) యని యెఱుంగవలెను. 'పరాప్రేమ' మనెడి భక్తియు దీని కొక యంగముగాఁ జెప్పవచ్చును. సమర్పణ మందును, శరణాగతియందును ''బ్రహ్మముకంటె 'నేను' వేఱు కా'' దను భావ మల్లుకొని యున్నది. ఈశ్వర ప్రణిధానము, శరణాగతి, ఆత్మార్పణము, ప్రణామ మనునవి సమానార్థకములే. (నా సాధన సామగ్రి - రెండవ మూటయందుఁ బ్రణామతత్త్వమును జూచునది.)
3. ''ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య'' - ప్రాణ రేచన విధారణముల చేతనుం జిత్తవృత్తులనిరోధము చేయఁబడును. ఈ వాక్యమున కిదే సాధారణుల ప్రాణాయామార్థము. వేదోపనిషత్తులందుఁ బ్రాణశబ్దము చైతన్య మను నర్థమందే వాడఁబడినది. 'ఆయామ' మనఁగా విస్తరింపుఁ ప్రాణశక్తిని విస్తరింపఁజేయుట యని యర్ధము. అంతే కాని యిచట వాయువుమాత్రమే యని యర్థము చేసికొనరాదు. ఇమ్మాటయే పైన సూచించితిని. దీని విపులవ్యాఖ్యకై 'ప్రాణాయామ తత్త్వము' అను శీర్షిక క్రిందఁ గల వ్యాఖ్యను నా ' సాధన సామగ్రి' యందో 'దేవపూజారహస్య' మందో చూచునది. గ్రంథకళేబరము పెరిగిపోవు నని యిట విడిచితిని.
4. కేవలపార్థివములైన విషయములనుండి యింద్రియ ములు మఱలి దివ్యములైన శబ్ద - స్పర్శ - రూప - రస - గంధము ల నెడి విషయములందే లాలసము లైనపుడు, అనంగా సుపరతము లైనపుడు చిత్తవృత్తులు నిరోధింపఁబడును.
5. 'శోకము లేనిది, (విశోక) అను నర్థమిచ్చు జ్యోతిస్సును దర్శించుటవల్లనే చిత్తవృత్తి నిరోధ మగును. ఇదే కుండలినీ శక్తి, వ్యష్టికుండలిని, యను పేరితో సుషుమ్నాపథ మందు సహస్రారమునకుఁ బయనించు మాహేశ్వరీ శక్తి. దాని జ్యోతిస్సును దర్శించుటవలనఁ జిత్తవృత్తి నిరోధ మగను. ఈ విషయమున విపుల వ్యాఖ్యకై నా వ్రాసిన 'లక్ష్మీహృదయ వివవరణమందో, సౌభాగ్యవిద్యాహృదయ వివరణమందో చూచునది. 'తెనాలి - సాధన గ్రంథ మండలి యందు' లభించును)
6. మనస్సు నాధారముగాఁ జేసికొని చేయు సాధనమే వీతరాగము. రాగద్వేషరహితమైన హృదయముగల గురుజనుల మనస్సుల నాధారము చేసికొనవలయును. వారి హృదయముల నెట్లాధారము చేసికొనవలె నను విషయ మాలోచింపవలయును. వారి చిత్రపటముల నెదుట నుంచుకొని ధ్యానించుటవలనను - వారిని స్మరించుకొనుట వలనను వారి హృదయముల యాధారము లభించునని కొందఱి యభిప్రాయము. ఈ విషయ మెట్లును నసత్యముకాదు. ఎందువల్ల ననఁగా మహాత్ములను ధ్యానించుటవలనను స్మరించుటవలనను. లాభము కలుగుననుట యనుభవ మందున్నది. కాని యీ లాభ##మెల్లరకుఁ గలుగజాలదు. రెండవ విధము శక్తి పాతము నకు వారి యనుగ్రహమే కారణమగుటచే వారి హృదయముల వలన సంపూర్ణమైన లాభము ప్రాప్తించును.
7. స్వప్నము, నిద్ర, యను నవస్థలయందైన తన జ్ఞాన మునుగూర్చి విచారణము చేసినను మనుష్యునకుం జిత్తవృత్తులు కొంతవరకు నిరోధింపఁబడును.
8. ఎట్టి ధ్యాన మెవరి కిష్టమో, దానిని గూర్చియే చింతించుటవలనసైతము చిత్తవృత్తులు నిరోధింపఁబడును.
ఏవిధమైన సాధనమందైనను మానసికానంద మత్యవసరము. అందువలననే మనస్సు నానందపఱచుటకు నుపాయములు తెల్పఁబడును. ఉపదేశములు చేయఁబడును. సుఖవంతుని జూచి మైత్రి, దుఃఖితుని జూచి దయ, పుణ్యాత్మునిజూచి యానందము, పాపాత్ముని జూచి యుపేక్షాభావము నలవరచుకొనుటవలన మనస్సునందు నాధ్యాత్మిక ప్రసాద ముదయించును.
శక్తి పాతమే జీవబ్రహ్మైక్య జ్ఞానసాధకము.
శక్తి పాతమువలనఁ బైనఁ జెప్పఁబడిన వన్నియు సిద్ధించి నను విశేషించి యీ విజ్ఞానమునకు సంబంధించిన వీతరాగ విషయమైన చిత్తమువల్లనే యాధ్యాత్మిక ప్రసాదము కలుగును. శక్తి పాతమువలన యోగభక్తుల దివ్యావేశము కలుగుటయే కాక 'జీవబ్రహ్మైక్యజ్ఞానము' సైతము కలుగును. మఱి యేవిధముగను గలుగదు.

శ్లో|| తత్త్వజ్ఞానేన మాయాయా భాధోనా
న్యేన

  కర్మణా | జ్ఞానం వేదాస్తవాక్యోత్థం బ్రహ్మాత్మైక్యత్వ గోచరమ్‌ ||
తచ్చ దేవప్రసాదేన గురో స్సాక్షా న్నిరీక్షణాత్‌ |
జాయతే శక్తిపాతేన వాక్యాదేవాధికారిణామ్‌ ||
-- బ్రహ్మణికా.
తత్త్వజ్ఞానముచేతనే మాయ తొలగును గాని మఱి యే కర్మము చేతనుం గాదు. వేదాంత మహావాక్యములవలనం గలుగు జ్ఞానము బ్రహ్మాత్మైక్యజ్ఞానమే ఆజ్ఞాన మీశ్వరప్రసాదమువలనను, గురువుయొక్క సాక్షాన్నిరీక్షణమువలనను, నధికారులకు మహావాక్యోపదేశ పూర్వకముగా శక్తిపాతము చేయుట చేతను గలుగునని చెప్పఁబడెను.
శక్తి స్వరూపము - ఆత్మస్వరూపము.
తోలుదొల్తఁ జెప్పఁబడిన యీశక్తి - ప్రకృతివలనఁ బుట్టు మెఱుపు మున్నగువానివంటిదా? లేక మఱియొక విధమైనదా? అను శంకకు సమాధాన మేమనఁగా - 'నీశక్తి ఆత్మనుండియే వచ్చు' నను మాట శ్రుతులయం దాడాడఁ గాన వచ్చును. ఇచ్చట మన మథర్వణ వేదమందుఁ బదునొకండవ కాండమందు నెనిమిదవసూక్త ము యొక్క 16, 17 మంత్రముల వలనఁ దెలియఁబడుదానిని గూర్చి చర్చింతము.
శ్లో|| యత్తచ్ఛరీరే మశయత్‌ సంధయా సంహితం
మహత్‌ |
యేనేద మద్య రోచేత కో అస్మిన్‌ వర్ణ మాభరత్‌ ||
సర్వే దేవా ఉపాశిక్షన్‌ తదజానాద్‌ వధూః సతీ |

ఈశావశన్యయా జాయా సా
స్మిన్‌ వర్ణమాభరత్‌ ||
'ఈ స్థూలశరీరము 'సంధా' (కలుపునది) యనెడి శక్తితోఁ గూడియున్నప్పటికిఁ జేష్ట లుడిగి యున్నది. దేని వలన నిది యిపుడు చైతన్యవంతముగాఁ దోచుచున్నది? అది యేది? ఏది దీనియందుం జైతన్యమును నించినది, ? - అని దేవత లెల్లరుఁ దెలిసికొనఁగోరి ధ్యానింపఁగాఁ బరమేశ్వరుని యందు స్వాభావికయై యతని పత్నిగా నెన్నఁబడుచున్న శక్తియే దీనిని జైతన్యపూర్ణముగాఁ జేసినదని తేల్చుకొనిరి.
శక్తులు రెండు విధములుగా నుత్పన్నము లగుచున్నట్లు కానవచ్చును. 1. యంత్రసహాయముచే నావిరి యొత్తిడివలన 'రైల్వేయింజను' మున్నగు వానియందుఁ బుట్టునదియు, 'బేటరీ - డైనమో' మున్నగు వానివలన నుత్పన్న మగు నదియు నైన విద్యుచ్ఛక్తి యొకటి. 2. మనుష్యులు, ఎద్దు, గుఱ్ఱము మున్నగువాని శరీరముల బలము వలన నుత్పన్నమగు శక్తియొకటి. దానివలన యంత్రాదులయందు నుత్పన్నమగు శక్తికంటెఁ దక్కున పని జరుగదు. ఆ రెండుశక్తుల పనులు సమానములుగాఁ దోచును శక్తిపాతమందుఁ జెప్పఁబడిన శక్తియు నట్టిదేనా? అయినను మనుష్యజంతువుల శారీరక బల మాత్మనుండి యుత్పన్న మగును. అనఁగా నాశక్తి కాత్మయే కారణము. కాని వానివల్లనగు పని చైతన్యము లేని యంత్రమువలన నుత్పన్నములైన శక్తులవల్ల నగుదానివలెనే జడప్రాయ మగునా? అపుడు రెండింటి యందును భేదము కాన రాదు, రెండు శక్తులును జైతన్యము లేని పనులనే చేయును - అను నీ శంక మున్ముందు నివారింపఁబడును.
ఆ చైతన్యము (చితి) శక్తియే, - యనఁగా శక్తిచైతన్యములకు భేదము లేదు. 'చైతన్యము, శక్తి, జ్ఞానము, ప్రాణ' మను పేళ్లు చితిశక్తివే యని శ్రుతిప్రమాణము. శక్తి జ్ఞాన వతియునై యున్నది.
వేదములయందును, సంహితలయందును, నుపనిషత్తులయందును, బ్రాహ్మణములందును బ్రాణోపాసన విధానము చెప్పఁబడియుండుటే కాక, ప్రాణస్వరూపము - ప్రాణస్థానము - ప్రాణోద్గమము మున్నగువాని వర్ణనము సైతము పలుతావులు జేయఁబడి యున్నది. వేదోక్తమైన ప్రాణము శ్వాసప్రశ్వాస గతికంటె వేఱౖనది. అది యాత్మనుండి యుత్పన్నమైనను. తద్మ (బ్రహ్మ) స్వరూపమైనను వ్యక్త శక్తి రూపమును ధరించును. ఈ విషయము క్రింద వ్రాయఁబడిన శ్రుతులవలన స్పష్టమగును.
'ఆత్మన ఏష ప్రాణో జాయతే మనోకృతే
నాయాత్యస్మిన్‌ శరీరే|'
-- ప్రశ్న - ఉ.
ఆత్మనుండి యీ ప్రాణ ముత్పన్న మగును. మనస్సు సహాయముచే నీ శరీరమున శక్తి బయల్పడును.
'ఏతస్మా జ్జాయతే ప్రాణః'
--ముండకోపనిషత్‌.
ప్రాణ మీ బ్రహ్మమువలననే కలుగుచున్నది.
'సర్వాణి హ వా ఇమాని భూతాని ప్రాణమేవాభి
సంవిశంతి ప్రాణ మభ్యుజ్జిహతే | '
--ఛాందోగ్యోపనిషత్‌.
పుట్టిన వన్నియు నిశ్చయముగాఁ బ్రాణములోనే లయమగును. ప్రాణమునుండియే యుత్పన్న మగును.
'యా ప్రాణన సంభవత్యదితి ర్దేవతామయీ, గుహాం ప్రవిశ్య తిష్ఠన్తీ యా భూతేభి ర్వ్యజాయత, ఏతద్వైతత్‌'
-కఠోపనిషత్‌.
్హదేవతామయియైన (ఆదితి) నాశనారహితయైన (పరమాత్మతో నెడయని) శక్తి ప్రాణమువల్లనే యుత్పన్న మగును. హృదయాకాశ మనెడి గుహయందుఁ బ్రవేశించి, యచట నిలిచియుండి భూతములవలన వ్యక్త మగును. నిజముగా నిది బ్రహ్మమే.
ఓ సౌమ్యుఁడా, నిజముగా మనస్సు ప్రాణమనెడి చైతన్యముతోఁ గట్టఁబడియున్న దే. అది జ్ఞానస్వరూపమున నంతట నల్లుకొనియున్నది. అదే యాత్మ, ముసలితనము, మరణము లేనిది. బ్రహ్మసూత్రములందు 'అత ఏవ ప్రాణః' ఈ ప్రాణ ముచ్ఛ్వాస నిశ్శ్వాసరూపమైన వాయువు కాదు. బ్రహ్మమే యని వ్యాఖ్యానింపఁబడినది.
ఆత్మ యనఁగా శుద్ధాత్మ యనియు, బ్రహ్మస్వరూపమే యనియు నెఱుంగవలయును. పిండాండమందు శుద్ధాత్మ యనియు, బ్రహ్మాండమందు బ్రహ్మ మనియు వ్యవహారము. అయినను రెండింటను బ్రహ్మ మని శ్రుతి స్మృత్యాది వ్యవహారము. జీవబ్రహ్మముల యేకత్వము నంగీకరింపనివారు ఆత్మయనఁగా బంధనమందుఁ జిక్కుపడిన యహంకారముతోఁ గూడిన జీవుఁ డని తలంపరాదు సరికదా, సర్వాంతర్యామియైన పరమాత్మ యనియే తలంపవలయును. ఏలనఁ బరమాత్మ శక్తియే మోక్ష సాధనము చేయింపఁగలది.
శక్తి శక్తి మంతులు.
శక్తికిని శక్తి మంతునకును భేదములేదు దానికంటె వేఱౖనది మఱొకటి లేదు. అదే యద్వయబ్రహ్మము. మనము శక్తియొక్క చేతనరూపమును భౌతికరూపమును గనుచున్నాము. ప్రకృతికార్యముల నన్నింటిని నడపించుటకు ననంత శక్తి భండారము దానియందుఁ గానవచ్చుచున్నది. ఆకాశాది మహాభూతముల ప్రత్యేకాణువునందును నిండియున్న శక్తిపరిమాణ మిప్పటి వైజ్ఞానికుల బుద్ధి కందరానంతగ నున్నది. సాధారణముగఁ బ్రకృతి కార్యములందు ననంతశక్తి పుట్టి యణఁగుచుండుట మనము కనుచున్నాము. సాధారణమైన మేఘ గర్జనవేళ బయల్పడి యణఁగిపోవుచున్నంత విద్యుచ్ఛక్తి నెట్టి గొప్ప యంత్రాలయములును బుట్టింపఁజాలవు. అట్టిదే చైతన్య శక్తియొక్కయు నట్టిదే. రెండు విధములైన చేతనాచేతనశక్తులు కలవారెవరు? మన మీశ్వరునే సర్వశక్తి మంతునిగ భావించనయెడల జడచేతనమయమైన జగత్తునందలి ప్రతికార్యము నా శక్తి మంతుని పని యనియే భావింపవలయును. ఇటులు భావించిన యెడలఁ బ్రకృతిని సంచలింపఁ జేయుశక్తి నే శక్తిమంతుఁడని భావింపవలయునా? లేక శక్తిమంతుఁడు శక్తికంటె భిన్నుఁడా? దీనికి సమాధానముగా నొకదృష్టాంతమును గైకొని యాలోచింతము, మానవశక్తి సర్వశక్తి మంతునికంటె భిన్నమైన శరీరమందలి యాత్మదని మనము కొంతసేపంగీకరించి చూతము. మానవుని శక్తి బాల్య - ¸°వన - కౌమార - వార్ధకాద్యవస్థలనుబట్టియు - ననారోగ్యాద్యవస్థలనుబట్టియు హెచ్చు తగ్గులుగా నుండుట మనము చూచుచున్నాము. శక్తి నుత్పత్తి చేయు నాత్మ యొకప్పు డెక్కువ, యొకప్పుడు తక్కువ శక్తిగలది యగునా ? ఆ యాత్మయే గత జన్మములందలి కీటాది శరీరములను వదలి క్రమముగాఁ బశు పక్షి మానవాది శరీరము లను ధరించును. అయినచో నాత్మయొక్క శక్తియందు మార్పు లగుచుండునా? ఆత్మ మార్పులు చెందున దని యంగీకరింపవలసి వచ్చును. అట్టి యపు డాత్మ నిర్వికార మనెడి సిద్ధాంతమున కిది విరుద్ధము. నిస్సంగమైన యాత్మ - 'శరీరము, మనస్సు, బుద్ధి, యహంకారము' మున్నగు నుపాధులు కారణముగా న్యూనాధిక శక్తులు కలదిగాఁ దోచును. బాలుని శరీరమందు శక్తి తక్కువ, యువకుని శరీరమందు శక్తి యెక్కువ యుండుటకుఁ గారణము - ఆత్మయందలి మార్పు కాదు సరికాదా, ఈ శరీరమనెడి యుపాధియం దగు వికారమే. మానవుఁడు తన శారీరకబలము నంచనా వేయఁజాలఁడు. ధైర్య సాహసోత్సాహములవలన దానిని వృద్ధిచేసికొనును. దీనివలన నాత్మ నిర్వికారమైనను నహంకారము కారణముగా శరీరము మున్నగు నుపాధులవలన శక్తిని వ్యక్తము చేయుచుండును. ఆత్మ వాస్తవముగా ననంత శక్తివంతమైనను నిష్క్రియముగనే యుండును. కాని దాని శక్తి యొక తీరుగనే యెల్లపుడుఁ దనలో నెట్టి హెచ్చుదగ్గులు లేక యవ్యక్తముగ నుండును. కాని దాని ప్రకాశమువల్లనే శరీరాద్యుపాధుల యందు శక్తి వ్యక్త మగుచుండును. ఆత్మ యొక నూదంటు ఱాయి వంటిది. ఆకర్షణక్షేత్రమందు దాని శక్తి నొక యినుప ముక్క నెల్లడి చేయుచుండును. కాని నూదంటు ఱాతి - యందు నున్నదియు, నినుపముక్కయందు వికసించు శక్తియు నొక్కటే కాని రెండు కాదు, ఇటులే శక్తిమంతుఁడైన బ్రహ్మమును, బ్రకృతిని (శక్తిని) జడచేతనములం దన్నిఁటను నెఱుంగునది. సాంఖ్యమ తానుసారముగఁ - 'బృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, తన్మాత్రలు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, అహంకారము, మహత్‌త్త్వము, అవ్యక్తము' -- అనునవి ప్రకృతియందలి యిరువదినాలుగు తత్త్వములు. ఈ తత్త్వము లన్నియుఁ బరమాత్మ శక్తివలననే జడచేతనమయ శక్తులుగా వ్యక్తమగుచుండును. పృథివ్యాదులైన యైదింటి యందును శక్తి యచేతనవలెనే యుండును. మిగిలిన పందొమ్మిది తత్త్వములయందును శక్తి చేతనావతియై యుండును. అవ్యక్తావస్థయందు విత్తునందు వృక్షకల్పన శక్తివలెనే నిదురించునట్లుండును. తక్కినతత్త్వములు దాని క్రియాత్మక రూపములు. అవ్యక్తము ప్రకృతి. ఇఁక మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు - అను నీ యేడును బ్రకృతులును, వికృతులును ననఁబడును. మనస్సు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు మహాభూతములు - ఈ పదునారును గేవల వికృతులు. పురుషుఁ డనఁగా శరీరమందు 'నేను' అను పేరితో నుండువాఁడు, ఆతఁడు ప్రకృతియుఁ గాఁడు, వికృతియుఁ గాడు.
అందువలన శక్తి యనునది బ్రహ్మమే. పైనఁ జెప్పఁబడిన శ్రుతివాక్యములవలన నా బ్రహ్మమే ప్రాణమని (చైతన్యమని, తెలియుచున్నది, శరీరమందుఁ (పిండాండమందు) జైతన్య మనెడి యర్థమందే వాడఁబడినది. మఱియు వ్యాససూత్రము లందుఁ బ్రహ్మ మనఁగా నేమియో వివరించుచోట 'జన్మాద్యన్యయతః' ఈ పరిదృశ్యమాన జగత్తునందు నుత్పత్తి స్థితి లయములు దేనివల్ల నగుచున్నవో యదేయని వేఱొకటి పెట్టక చైతన్యశక్తినే బ్రహ్మముగా సూచించిరి. ఈ చైతన్యము యొక్క క్రియాత్మకరూపము లైదు. ప్రాణము, అపానము సమానము, వ్యాసము, ఉదానము - అనునవే. ఇవియే బ్రహ్మాండమందు - సూర్యుండు ప్రాణశక్తి, భూమి యొక్క అకర్షణశక్తి యపానము, ఆకాశము సమానము, వాయువు వ్యానము, అగ్ని యుదానము. బ్రహ్మ మనెడి యకర్షణరంగమును బ్రాణమందుము. అది (బ్రహ్మము) యాధారముగానే పలువిధములైన జడచైతన్య శక్తులు వ్యక్తమగుచున్నవి. కాని యయస్కాంత మను నాకర్షణ రంగమును స్థూలమును సూక్ష్మమును నగుటచే భిన్నమని తలంచుచున్నాము. సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మము సర్వవ్యాపి యగుటచే నయస్కాంతము వంటిదే. ఎన్నడును నెట్టి మార్పును బొందదు. ఎల్లప్పుడవ్యయమును బ్రశాంత మునైయుండదు, క్రియాత్మకముగానే యుండదు. ప్రకృతి దాని మాయయే, అనఁగా దాని శక్తియే, మాయాశబ్దము బ్రహ్మశక్తి యను నర్థమునందే శ్రుతులయందు వ్యవహరింపఁబడినది. ఇది ప్రసిద్ధము. ఏది పంచమహా భూతములను నాధారము చేసికొని వ్యక్తమగుచున్నదో యా శక్తినే జడశక్తి యందుము. ఏది యింద్రియ మనోబుద్ధ్యహంకారముల యాధారమున వ్యక్తమగునో యదియే చేతనశక్తి యనఁబడును. కాని, మహత్తత్త్వమువలన నుత్పన్నమైన యహంకార మాధారముగ వ్యక్తమగు శక్తియే యాధ్యాత్మికశక్తి. ఈ యాధ్యాత్మికశక్తి ప్రయోగమే శక్తిపాత మనెడి క్రియ యందగును.
కుండలిని.
'యదిదం కించ జగత్‌ సర్వం ప్రాణ ఏజతి నిఃసృతం'
--కఠోపనిషత్‌.
అనఁగా నీ జగత్తంతయు బ్రహ్మమునుండి ధారఁగా వచ్చు ప్రాణము (చైతన్యము) యొక్క స్పందనము మాత్రమే.
అదియే కుండలిని ఈ యాధ్యాత్మికశక్తినే మనుష్యుని యందు 'వ్యష్టికుండలిని' యందురు. కుండలిని యాకారము సర్పాకారముగా భావింపఁబడినది. ఈ బ్రహ్మాండమును ధరించు నీ సర్పాకార సమష్టికుండలినినే శేషుండు, అనంతుఁడు నందురు. కనుకఁ బిండాండ బ్రహ్మాండముల రెండింటిని ధరించు శక్తి యొక్కటియే.
కుండల్యేవ భ##వేచ్ఛక్తి స్తాం తు సఞ్చాలయే ద్బుధః |
స్వస్థానా దాభ్రువో ర్మధ్యం శక్తి చాలన ముచ్యతే ||
--యోగకుండల్యుపనిషత్‌.
పిండాండమందలి భూతత్త్వవిశిష్టమైన మూలాధార మందుఁ దొంగున్న పాముగా భావింపఁబడిన యా శక్తిని భ్రూమధ్యము - అనఁగా మనస్తత్త్వవిశిష్టమైన యాజ్ఞాచక్రము వఱకును గొనిపోవలయునని కుండలినీ తత్త్వవేత్త లైన పండితలందురు. ఇదియే శక్తి చాలన మనఁబడును.
జ్ఞేయా శక్తి రియం విష్ణో ర్నిర్భయా స్వర్ణభాస్వరా |
సత్త్వం రజ స్తమశ్చేతి గుణత్రయ ప్రసూతికా ||
మహాకుండలినీ ప్రోక్తా పరబ్రహ్మ స్వరూపిణీ|

జీవశక్తిః కుండలాఖ్యా ప్రాణాకారా
థతైజసీ ||
అనఁగా నీ శక్తిని బంగారు కాంతిగల దానిగను, సత్త్వరజస్తమోగుణములను (అవస్థలను) గలిగించునట్టిదై సర్వవ్యాపి విష్ణువు యొక్క నిర్భయానామక శక్తి యనియు నెఱుంగవలయును. ఈ పరబ్రహ్మస్వరూప శక్తియే ''మహాకుండలిని'' యనుఁబడును. జీవరూపిణియైన యీ శక్తియే కుండలిన్యాకారమున వెలయు తేజోమయి. తొలుదొల్త శక్తిపాత మన నేమో చెప్పితిమి. కాని శక్తి యన నేమో యప్పుడు చెప్పలేదు. శక్తి యనఁగా నిచట విజ్ఞానమునుగూర్చిన వ్యాఖ్యానము కాదు సరికదా, శక్తిపాతమునుగూర్చిన వ్యాఖ్యానమే చేయబడును. కనుక శక్తిపాత మెవ్వనియం దగునో యను శంకగలుగును. అది మున్ముందు వివరింపబడును.
శక్తి పాత మెవ్వనియందగును?
శక్తిపాతమనునది శిష్యులందే చేయఁబడును. శిష్యుఁడన్నంతనే గురువువలనఁ దనయందు నాధ్యాత్మిక శక్తిపాతము చేయఁబడినవాఁడని విస్పష్టమగుచున్నది. ఈ మాటవలన గురువు తన శిష్యునందు శక్తిపాతము చేయుట యనునదే వారి (గురుశిష్య) సంబంధము. కనుక గురువుచే శక్తి పాతము శిష్యుని కల్యాణమునకే చేయఁబడు నని స్పష్టము, సామాన్య గురువు శిష్యుల మానసికోన్నతి కై పాఠశిక్షణము చేయునటులే యాధ్యాత్మికగురుఁడు తన శిష్యునందు నాధ్యాత్మికోన్నతికై శక్తిపాతము చేయును.
దానివలననే శక్తి యుద్బద్ధ యగును, (జాగరిత యగును.) అనఁగా శిష్యుని యందలి శక్తి గురువువలన శక్తిపాత ప్రయత్నముచే మేల్కొల్పబడును. కనుక ప్రత్యేక మనుజుని మూలాధారమందు నాధ్యాత్మికశక్తి సుప్తమైనటు లుండు ననియేకదా, యభిప్రాయము. అది మేల్కొన్న తరువాత దానిస్వరూప మనుభూతము (ప్రత్యక్షము) కాఁజొచ్చును. శిష్యునియందలి శక్తిని మేల్కొల్పుటకే 'శక్తిపాత' మందురు. ఈ విషయము 'శక్తి రహస్య' మందుఁ జెప్పఁబడెను.
''వ్యాపినీ పరమా శక్తిః పతితే త్యుచ్యతే కథమ్‌ |
ఊర్ధ్వా దధోగతిః పాతోమూర్తస్యా సర్వగస్య చ ||
సత్యం సా వ్యాపినీ నిత్యా సహజా శివపత్‌ స్థితా |
కిం త్వియం మలకర్మాది పాశబద్ధేషు సంవృతా |
పక్వదోషేషు నువ్యక్తా పతితే త్యుపచర్యతే ||
అనంగా సర్వవ్యాపియైన యా పరమశక్తి పడిపోయిన దని యనుట యెట్లు సంభవించును? ఆ శక్తి క్రిందికిఁ బడుటే కాదు, అన్ని దిశలకు వ్యాపింపఁగలది. అది పడుట యనఁగా గ్రిందికి జాఱుట యని యర్థము కదా! మఱి యటు లెందుకగును? ఒక చోట మూర్తిమంతమైన వస్తువు - అనంగా గొంతస్థలమును మాత్రమే యాక్రమించి యుండి యేదేనొక యాకారముతో వెలయు వస్తువు - తానున్న స్థలమునుండి జాఱిపోవుటనే పాత మందురు. అది లేకుండుట యనుట యెన్నడును లేదు కనుక సత్యము. అది వ్యాపిని ఎల్లదెసలకు వ్యాపింపఁగలది. అది నిత్యము. ఇప్పుడప్పుడనక, యక్కడ నిక్కడ ననక (దేశకాలాపరిచ్ఛన్నమై) యుండును, స్వభావము చేత శివునివలెఁ బరమాత్మ. అనఁగా సర్వత్ర నిండియుండుట చేతఁ గదలనిదై తనకు వేఱొక్క కారణములేనిదై యున్నది. కాని మలకర్మాది పాశబద్ధులయందు నావృతయై యుండును దోషపాకమైన వారియందుఁ జక్కంగా వ్యక్తయగును. అప్పుడది పతిత శక్తిపాత మనఁబడును. దీనినే ప్రాణోత్థాన మనియు నందురు మనుష్యుని మనోబుద్ధీంద్రియములను. శరీరమును ధరించునట్టి ప్రాణశక్తి మేలుకొనఁగనే యూర్థ్వగామిని యగును. దానివలన మహాయోగము సిద్ధించును.
సమాధి.
'యోగమే సమాధి' యని భగవంతుఁడైన వేదవ్యాసుఁ డనెను. సమాధి సంప్రజ్ఞాతము, అసంప్రజ్ఞాతము నని రెండు విధములు. సమాధికాలమునఁ బ్రజ్ఞ యింతేని నిల్చి యుండుచో నది 'సంప్రజ్ఞాతసమాధి' యనియు, నా యవస్థలోఁ బ్రజ్ఞ పూర్తిగా విరుద్ధమై పోవుచో నపుడది 'యసంప్రజ్ఞాత సమాధి' యనియు ననఁబడును. అసంప్రజ్ఞతసమాధిని 'నిర్బీజ' మనియు వ్యవహరింతురు. సంప్రజ్ఞాతమం దాఱు భేదములు గలవు. అవి సవితర్కము - నిర్వితర్కము - సవిచారము - నిర్విచారము - సానందము - సాస్మితము అనునవి. ''చిత్తవృత్తి నిరోధింపఁబడుటే యోగ'' - మని పతంజలి సూత్రించెను. కాని 'నిరోధ' శబ్దమునకు మున్నెట్టి విశేషణమును జేర్పంబడలేదు. ఎంతగా నిరోధింపఁబడినపుడు 'యోగ' మనంబడునో చెప్పఁబడలేదు. కనుక నించుకంత నిరోధ మైనను యోగ మనవచ్చును. పూర్తి నిరోధమునుసైతము 'యోగ' మనవచ్చును. ఆ మహర్షి యోగానుష్ఠానమునకు నెనిమిది యంగములు కలవనెను. 1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము 5. ప్రత్యాహారము, 6. ధారణము, 7. ధ్యానము 8. సమాధి అనఁగా జిత్తవృత్తి నిరోధము ప్రథమాంగమైన యమమందే ప్రారంభమగును. పూర్తి నిరోధము 'నిర్బీజ సమాధి' యందుఁ గలుగును. చిత్తము సత్త్వరజ స్తమోగుణములతోఁ (అవస్థలతో) గూడి యుండును. వీనియందు నేదేనొకటి ప్రధానముగాను, మిగిలినవి యప్రధానముగా నుండి యన్యోన్యము తిరస్కరించుకొను చుండును. తమోగుణమువలన మూఢత్వము, రజోగుణమువలన క్షేపము. రజస్సత్త్వములవలన విక్షేపము, సత్త్వమువలన నేకాగ్రత, మూఁటియొక్క యన్యోన్యతిరస్కరణమందలి హెచ్చుతగ్గులచే నిరోధావస్థకు భిన్నభిన్న భూమిక లేర్పడును. ఏకాగ్ర నిరుద్ధావస్థలు యోగులకు మాత్రమే కలుగును. కాని, సామాన్యులకుఁ గలుగవు.
చిత్తవృత్తులు - అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - అనెడి యైదు విధములైన క్లేశములతోఁ గూడి యుండును. మఱి వీనితోఁ గూడకయు నుండును. అనిత్య మందు నిత్యత, అపవిత్రమందుఁ బవిత్రత, దుఃఖమందు సుఖము, అనాత్మవస్తువులందు నాత్మభావనయు నుండుటనే 'యవిద్య' యందురు. 'నేనున్నాను' - అను భావమును 'అస్మిత' యందురు అస్మితను గూర్చిన విపులవివరణమునకై నా 'సాధనసామగ్రి' మూఁడవ మూట యందుఁ జూచునది. విషయములం దాసక్తిని రాగ మనియు, అసూయను ద్వేష మనియు నందురు. బహుదీర్ఘ కాలము బ్రతికియుండుకోరిక; మృత్యుభయము దానినే 'అభినివేశ' మందురు. బద్ధజీవుని చిత్తవృత్తు లీ పైని చెప్పిన యైదింటితోఁ గూడి యుండును. జీవన్ముక్తులైన మహాత్ముల వృత్తులా క్లేశములు లేకుండును.
పంచవిధ వృత్తులు
ఐదు విధములైన వృత్తులివి. 1. ప్రమాణవృత్తులు, ఇవి మూఁడు విధములు - ప్రత్యక్షప్రమాణము, అనుమాన ప్రమానము, ఆగమప్రమాణము. చూచుట, వినుట, యాఘ్రాణించుట, రుచిచూచుట, స్పృశించుట - యను నీ యైదును బ్రత్యక్షజ్ఞానవృత్తులు. ఈ యైదింటి సహాయమువలనఁ దెలియఁ బడినపుడు జ్ఞానము మనోబుద్ధుల సహాయముచే ననుమానింపఁ బడును. ఇదే యనుమాన ప్రమాణము. ఎట్లనఁగాఁ బొగ రేగు చున్న చోటిని జూచి యచట నగ్ని యున్నదని యూహించుట వంటిదే యనుమానము. ప్రత్యక్షానుమానములచే నందని విషయ మనుభవశాలురవలనను, శాస్త్రములవలనను దెలియఁబడును. దానినే యాప్తవాక్యప్రమాణ మందురు.
2. విపర్యయవృత్తి, అనఁగా నసద్రూపమైన మిథ్యాజ్ఞానము. అనఁగా రజ్జుసర్పభ్రాంతి. (త్రాటినిజూచి పామను కొనుట.)
3. వికల్పజ్ఞానమ. దీనియందు శాబ్దికజ్ఞానము మాత్రమే యుండును. దానినిబట్టి యొక వస్తువుయొక్క యథాస్థితి పట్టుపడదు. ఎట్లనఁగా 'నాత్మయొక్క చేతనశక్తి' యను నపుడు మాటమాత్రమే కాని, యాత్మకంటెఁ జైతన్యము వేఱు కాదు. మాటలవలన రెండును వేర్వేఱని తోచుటయే వికల్పజ్ఞానము.
4. నిద్ర, సుషుప్త్యవస్థయుఁ జిత్తముయొక్క వృత్తులలో నొకటి. దానియందు నెట్టి యాలంబనములు నుండవు.
5. స్మృతి, మున్ను జరిగిన - 'కనుట, వినుట' మున్నగు ననుభవములు మఱలఁ దలంపునకు వచ్చుటయే స్మృతి. పైనఁ జెప్పఁబడిన యైదువిధముల వృత్తులలో జాగ్రత్స్వప్న సుషుప్తులనెడి మూడవస్థలును నిమిడి యున్నవి. స్వప్నమందు స్మృతి వృత్తికి లోఁబడిన, తమోగుణముచే నావరింపఁబడిన మనోబుద్ధీంద్రియముల సంస్కారములు పనిచేయఁ గడంగును.
ఆకాశము, మేఘము, వృక్షములు మొదలుగువాని ప్రతిబింబములు జలాశయములందుఁ బడినపుడు జలతలము గన్పించదు. కాని, ప్రతిబింబములు దొలఁగిపోయినంతనే నీటితలము కాననగును. ఇదియే దృష్టాంతము. జలాశయమందు నలలు లేచునపుడు జలతలము ప్రకాశింపదు. అల లణంగి పోయి నంతనే జలతలము సరిగా కానవచ్చును. అటులే జలతలమును బోలిన యాత్మ చిత్తవృత్తుల కారణమునఁ దెలియఁబడును. వృత్తులు శాంతించినంతనే యాత్మ సాక్షాత్కరించును. చిత్తమనెడి జలమునందు బాహ్యవిషయముల ప్రతిబింబములు తఱచుగాఁ బడుచునే యుండును స్మృతివలన సంకల్ప వికల్ప రూపములైన యలలు లేచుచుండును. నిద్రయందలి తమోగుణముయొక్క చేరికవలనఁ గలక వారిపోవుచుండును. దానివలన నాత్మస్థితి పొందఁబడదు (తెలియఁబడదు). ఐదువిధములైన వృత్తులు నిరోధింపఁబడునపుడు ఆత్మ తనస్వరూపమున నిల్చును.
ఆత్మదర్శనమువలనఁ జిత్తవృత్తి జ్ఞానముయొక్క మిథ్యాత్త్వమును, ఆత్మజ్ఞానముయొక్క సత్యతయుఁ జిత్తముపైఁ బ్రతిఫలింపఁ జొచ్చును. జగత్తుయొక్క బంధన మనెడి మిథ్యా విపర్యయ జ్ఞానము మఱలి పోవును. ఎటు లనఁగా నిది త్రాడని తెలిసినంతనే దానయం దుండిన సర్పభ్రాంతి తొలఁగి పోవును.
ప్రాణముయొక్క గొప్పఁఁదనము.
పైనఁ జెప్పిన వృత్తుల నిరోధముకొఱకు శక్తిపాత మెటులు తోడ్పడునో యింతకు మున్ను దొలుదొల్తనే చెప్పఁబడినది. వృత్తినిరోధము ప్రాణవశ మగుటవలన వృత్తులను నిరోధించుట సులభమని తెలియును. ఈ క్రిందఁ జెప్పఁబడు వృత్తులు ప్రాణాధీనములు. 'ప్రాణస్యేదం వశే సర్వం' (అంతయును బ్రాణమున కధీనము) అనెడు శ్రుతి దీనికిం బ్రమాణము.
శ్లో || ఓం నమో ప్రాణాయ నమో యస్య సర్వ
మిదం వశే |
యో భూతః సర్వస్యేశ్వరో యస్మిం త్సర్వం
ప్రతిష్ఠితమ్‌ ||
--- అథర్వవేద ప్రాణసూక్తము.
అనఁగా జగత్తంతయు దేని వశమం దున్నదో, సర్వమందును నేది యున్నదో యా ప్రాణమునకు నమస్కారము.
ఓం యా తే తనూ ర్వాచి ప్రతిష్ఠితా; యా శ్రోత్రే
యా చక్షుషి; యా చ మనసి; సం తతా శివాం తాం
కురు మోత్క్రమీః ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే
యత్ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్‌ రక్షస్వ, శ్రీశ్చ ప్రజ్ఞాం చ విధేహి నః || ప్రశ్నోపనిషత్‌.
అనఁగా నే నీ స్వరూపము మా వాక్కునందును. శ్రోత్రమందును, నేత్రమందును, మనస్సునందును, వ్యాపించి యున్నదో దానిని నాయందు భద్రముగా నుంచుము. ఉత్కృమింపఁజేయకుము. మూడవదైన స్వర్లోకమం దేది ప్రతిష్ఠిత మైనదో, దానికే యనఁగా నా ప్రాణస్వరూపమునకే యీ లోక మంతయు వశ##మై యున్నది. తల్లి బిడ్డలనువలె మమ్ము రక్షంపుము. సంపదలను, బ్రజ్ఞను, ఆత్మజ్ఞానమును మా కిమ్ము.
ప్రాణ చిత్త వృత్తులు పరస్పరము నిరోధించుకొనును. ప్రాణ నిరోధమువలన వృత్తినిరోధము, వృత్తి నిరోధమువలనఁ బ్రాణనిరోధము నగుచుండును. క్రమముగా నొండొంటి నిరోధ మధిక మగుచుండును. మొదటఁ బ్రాణనిరోధము కావలయును. ఏలన స్వతంత్రముగ వృత్తినిరోధము కష్టసాధ్యము.
మహాయోగము.


'మహా
& కిమ్‌? విశేషత్వా చ్ఛక్త్యుద్బోధనే తచ్ఛిద్ధేః',


వెనుక శక్త్యుద్బోధము వలన మహాయోగము సిద్దించునని వ్రాసియుంటిని. ఇందలి యభిప్రాయ మేమనఁగా నిది వ్యాస పతంజలులు చెప్పినదిగాక వేఱొక్కటియా? యనుశంక కలుగవచ్చును. సమాధాన మేమనఁగా యోగశక్తి శక్త్యుద్బోధము వలన శీఘ్రముగా నగును. మఱి శ్రద్ధాపూర్వక బహుప్రయత్నముచే దీర్ఘకాలాభ్యాసమువలన వృత్తి నిరోధము కాఁగల దందురు, బహుపరిశ్రమచే దీర్ఘకాల లభ్యమైన యా యోగమే గురుకృపచేత శీఘ్రముగా లభించును.
'హఠ మన్త్ర లయ రాజయోగాన్తర్భూమికత్వాచ్చ శ్రుతేః'.
హఠయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగ మనునవి యిందంతర్భూతము లగుటచేత దీనిని మహాయోగ మంటిమి. శక్తి జాగరితయైన తరువాతనే - హఠయోగము మొదలు నాలుగుయోగము లంతర్భూమికల రూపమున నుండి క్రమముగాఁ దామే వికసించును. ఇదే విశేషము.


శ్లో || మన్త్రో లయో హఠో రాజయోగో
న్తర్భూమికాః


క్రమాత్‌ |


ఏక ఏవ చతుర్థో
యం మహాయోగోభి ధీయతే |'

యోగశిఖోపనిషత్‌ - 129.
అనంగా మంత్రము, లయము, హఠము, రాజయోగము ననునవి క్రమముగా నంతర్భూమికలు కనుక నొక్క యోగమే నాలుగు విధములుగా నుండుటవలన మహాయోగ మనఁబడును.
హఠయోగము - నాడీశుద్ధి.
'ఆసన ప్రాణాయామ బంధ ముద్రాదమో హఠః'.

ಆ್ಢಠಿಡಧಿನಡ್ಧನಡಗಗ, úFಣುಳಿಬಿಖಬಗ್ಧನಡಗ್ಧನಡಗಗ, ್ವರಔ್ಝ್ಫಖಬ್ಧನಡಗಗ, ್ಧನಡಗಗú್ಫಖಬಶಿರಗ ಪ್ಧಡಗಗ್ಫಖಬಶಿರ್ಜಖ್ಝಗಧಿನಡ್ನಡ ್ಢ್ಥದಿದಿದಿhಖ್ಝ್ಬಬಿಬಗ್ಜಿಖ್ಝ್ಧನಡಗಗ, ಇ¿ಖರೌವರಬ úಶಳಿುುಬಿಖಬಗ್ಧಿನಡಗ ್ಧನಡಗಧಿನಡಬ್ಜಖ ್ಛ ಛಖಶ್ರ್ಢೀಠಿಡ್ಧನಡಗಗಧಿನಡಗ ್ವರಗಿಔಞ್ಝಔ್ಝ¿ಖರಗವರ (ನಿಡಶಿರಗ್ಢಟಡ್ಟವರ) ಃಖಕಿಗಔ್ಝಹಿರಔ್ಝ¿ಖರಗವರ, ಟಔ್ಝ್ಘ್ಯರಔ್ಝ¿ಖರಗವರ ್ಧನಡಗಿúಭಿಖ್ಮಪ್ಧಡ್ಘಗ ú್ಜಖ್ಝಣ್ಥದಿದಿದಿಔ್ಝ್ಢಟಡಬ್ವರಫಿಖಿಬಧಿನಡ್ನಡ. ಇಔ್ಝ್ಫಖಬಗಬ ್ಜಖ್ಝಶಿರಗ್ಜಖ್ಝಗ ್ಢಟಟಿಡಶಿರ್ಧನಡಗಗ ಙರಿ¿ರಭಿಖ್ಮಧಿನಡù ಛಖಕಿಃಖಿಕಿò ್ಬಬಿಬಗಗಃಖಕಿೃ ್ನಡ್ಢಠಿಡò್ಕ್ಗ್ಭ್ಮ. ಟಔ್ಝ್ಘ¿ಖರಧಿಣ್ಫಖಬಗಙ್ಶಾರಧಿನಡ ್ಧನಡಗಗಿಫಿಖಬಗ ್ಢಟಡಧಿನಡಗಶಿರಗಧಿನಡಗ úಶಳಿುು ್ನಡ್ಢಠಿಡò್ಕ್ಗ್ಭ್ಮಘಿಃಕ್ಘಿ ಭ್ಙ್ಘಿಫಿಖಬöಫಿಖಬಗಧಿನಡಗ. ಅಔ್ಝ್ಫಖಬಗಧಿನಡಗ ್ಜಖ್ಝಗಔ್ಝಶಷಿರಧಿನಡಃಖಶಿರ್ಧನಡಗಗ úಃಖಕ್ಧಿನಡಗ್ಧನಡಗಗ್ಜಖ ್ಣ್ಥದಿದಿದ್ಯಿರೌಔ್ಝ¿ಖರಗವರ ಬಿಖಬಗಶಳಿù್ಢಠಿಡ್ಧನಡಗಗಭ್ಙ್ಘಿಫಿಖಿಬ್ಫಞಬ. úFಣುಳಿಬಿಖಬಗ್ಧಿನಡಗ úಃಖಿಕಿಬಿಖಬಗಧಿನಡಗ ್ಧನಡಗಔ್ಝúಭಿಖ್ಮ್ಜಖ್ಝಔಖ್ಝ÷್‌್ಧನಡಗಗ್ಜಖಬ ಾ್ಲರ್ಘಬಿಖಬಗಗವರ ಪ್ಧಡ್ಘಗಶಿರಗ, ್ಧನಡಗಔ್ಝúಭಿಖ್ಮ್ಧನಡಗಧಿನಡಬ್ಜಖ ್ನಡಛಖಕಿಗ್ಫô್ರಖಬಙರಿ¿ರಭಿಖ್ಮಧಿನಡùಪ್ಧಡ್ಘಗ ಪ್ಧಡ್ಘನಿಡ ್ಢಠಿಡಶ್ರೀಔಖ್ಝಗ್ಢಿಟಡಪ್ಧಡಗಿ ಬಿಖಬಗಿಬಿಖಬಗಿ ಪ್ಫಬ್ಘ್ಧನಡಭಿಣ ಛಖಕಿಃಖಕಿಗòಶಿರಧಿನಡಗ ಪ್ಫಬಶಿರಗö ಹಿಜರ್ಲಳಿಕಖಕ್ಕಿಔಖ್ಝ ್ಛ ್ಢಟಡ್ಫಖಬ ್ಛ ್ಧಣಃಖಕಿùಔಖ್ಝಗ್ಢಿಟಡ್ಧನಡಗಗಧಿನಡ ಧಿನಡಗಔ್ಝಫಿಖಬಗಧಿನಡ್ಫಞಬ. ್ಧನಡಗಔ್ಝúಭಿಣಔóಖ್ಝ ್ಲìಳಿಧಿನಡ್ಧನಡಗಗಭ್ಙ್ಘಿಬ ್ಜಖ್ಝಗಔ್ಝಶಷಿರಃಖಕ್ಧಿನಡಗಗಧಿನಡಗ ್ಠಣ್ಜಞ್ಝಔ್ಝ¿ಖರಗಪಧಿಡಫಿಖಬ ಧಿಣಬಿಖಬಗಿ ಪ್ಫಬ್ಘ್ಧನಡಭಿಣಛಖಕಿಃಖಕಿಗòಶಿರಗಧಿನಡಗ ್ಠಣ್ಫಖಬಃಖಕಿಗಧಿನಡಔ್ಝ್ಫಖಬಗ ್ನಡಃಖಕಿಣಠಿಡಔ್ಝ¿ಖರಗಧಿನಡಗ. ಅವರಗಃಖಃಖಕಿ ಘಿಃಕ್ಘ್ಧಿನಡಶಿರಔ್ಝ ಛಖಶ್ರ್ಢೀಠಿಡ ನಿಡಔ್ಙ್ಘ್ಫಖಬಪ್ಧಡ್ಘಗ ಬಿಖಬಗ್ಜಖ್ಝಗಧಿನಡ್ಫಞಬ ಃ್ಙಔ್ಝಭಿಖ್ಮ್ಧನಡೂುಃಖಕಿಗ ಧಿಣಔ್ಙ್ಘ್ಜಖ್ಝù್ಶಳಿಶಷಿರ್ಧನಡಗಗಧಿನಡಃಖಕಿಗಬ ್ಫ್ಙ್ಘಫಿಖಬöಫಿಖಬಗಧಿನಡಗ. ಃಖನಿಡ, ್ಯರಭಿಖ್ಮò ್ಧನಡ್ಗ್ಭ್ಮò ನಿಡಔ್ಙ್ಘ್ಫಖಬ್ಧನಡಗಗ ಘಿಃಕ್ಘ್ಧಿನಡಶಿರ್ಧನಡಗಗ ್ಢಟಡಔಞ್ಝ್ನಡಗಭಿಖ್ಮ್ಧನಡಗಗ ್ಜಖ್ಝಪಧಿಡ್ಘ ಬಿಖಬಗ್ಜಖ್ಝಗಧಿನಡಗ. ಈ ್ನಡ್ಢಡಿಡ್ಕಬಿಖಬಗ್ಧನಡಗಗಧಿನಡ ಧಿಣ ú್ಧಣಣಠಿಡಧಿನಡ ‘್ಠ್ತహం సమాధి' యను గ్రంథమును జూచునది.
బంధ-ముద్ర లనేకములు. అందు మూల బంధము, ఓడ్యాణ బంధము, జాలంధర బంధము, మహాబంధము మున్నగు బంధములను, ఖేచరి, మహాబంధ మహాముద్ర, మహాభేది, విపరీతకరణి వజ్రౌలి, శక్తిచాలనము మున్నగువానిని ముఖ్యములుగాఁ గొనిరి, ఆసనము లసంఖ్యములుగా నున్నవి. అందెనుబది నాలుగు ముఖ్యము లని వానిని వర్ణించిరి. ఆ బంధనా సనాదుల వర్ణనము మన కిట నావశ్యకము కాదు. ఒక్కొక్క యాసనము వలన నొక్కొక్క ప్రయోజనము చెప్పఁబడినది. పాతంజలమతమున 'స్థిర సుఖాసనము' చెప్పఁబడినది. మఱియు, సాంఖ్యు లెట్టి యాసనమును మన్నింపక స్థిరముగా సుఖముగా నుండు నాసనమును (అంగవిన్యాసమును) గ్రహించుట చాలు ననిరి.
దానివలన నాడీశుద్ధి యగును. నాడు లనఁగా స్నాయువులని యభిప్రాయము. విద్యుత్తును బ్రవహింపఁ జేయుటకుఁ దీఁగ లెట్టివో, ప్రాణశక్తిని బ్రవహింపఁ జేయుటకు స్నాయువులు నట్టివే, సాధారణ మనుష్యుల నాడులు మాలిన్యముతోఁ గూడి యుండుట చేఁ వానిదారిని బ్రాణ ప్రవాహము సరిగా సుఖముగాఁ గాదు, హఠయోగ సాధనమువలన స్నాయు మండల గత మలములు తొలఁగిపోవును.
మంత్రయోగము.
'స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము' ననునవియే మంత్రయోగము. పాతంజల దర్శనమందు నర్థభావనతోఁ గూడిన ప్రణవ మంత్ర జపమే 'స్వాధ్యాయ' మనఁబడెను, ఇచట 'ఓంకార ప్రణవౌ నమౌ' అని కోశములందుఁ గానవచ్చి నను శాక్తతంత్రములందు, 'ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం' అను నైదును బ్రణవములుగా నెన్నఁబడెను. 'యా పఞ్చ ప్రణవ ద్విరేఫ నలినీ' అను స్తుతివ్యాఖ్యాతలచే నీ యైదును బ్రణవ ములుగానే స్వీకరింపఁబడినవి. 'ప్రకర్షేణ నవః - ప్రణవః ' ఎప్పటి కప్పుడే క్రొత్తది, అది యాత్మవస్తువు. దానిని దెల్పున దెల్లఁ బ్రణవమే. మఱియు 'ప్రకృతే ర్నవః ప్రణవః' - ప్రకృతిని దాటించు నావ. 'నవ ఏవ నావః' భవమును దాటించు తెప్ప. 'తజ్జప స్తదర్థ భావనం' అనెడి యనుశాసనానుసారముగ నర్థబావనము తోడిదే జపము. అటు లైనపుడే మంత్రము చైతన్యవంత మగును. 'మననమువలన' రక్షణము గలిగించునది, యనుట సార్థక మగును. ఇదే స్వాధ్యాయము, అధ్యయనము ననిపించుకొనును. అఖండ చైతన్యరూప పరమాత్మను జేరు దారియైన యీ స్వాధ్యాయమందు మోక్షప్రదమంత్ర జపమును, నాత్మతత్త్వ విషయక శ్రవణమును, నర్థ జ్ఞాన యుక్త పఠన మననములును జేర్పఁబడినవి. వేదవ్యాసుఁడును-
శ్లో|| 'స్వాధ్యాయా ద్యోగసంపత్త్యా పరమాత్మా ప్రకాశ్యతే',
'స్వాధ్యాయము, యోగసంపద' - అనువాని వలననే పరమాత్మ వస్తువు బయల్పెట్టంబడు నని (తెలియఁబడునని) యుపదేశించెను.
ఈశ్వర ప్రణిధాన మనఁగా సర్వము నీశ్వర సమర్పణము చేయుట. అనఁగా జీవాహంకార కర్తృత్వమును దొలంగుఁ ద్రోసి సర్వకర్తృత్వము నీశ్వరునియందే పెట్టుట, దీనికే శరణాగతి, ఆత్మార్పణము నని పేళ్ళు, దీనివలన సమాధి సిద్ధించును.
ఆత్మార్పణ' మనఁగా 'నేను' అనునది మఱి లేదు. ఉన్నదంతయుఁ బూర్ణాహంతా రూపుఁడైన యీశ్వరుఁడే యనెడి దృఢ నిశ్చయము. దీనివలన 'సోఁహం' 'అతఁడే యీ నేను' అనెడి సమాహితావస్థ కలుగును. ఇదే సమాధి.
షట్చక్రవేధము - లయయోగము.
ప్రాణశక్తి యీ 'నేనునందు' స్థిరపడినంతనే లయ యోగము సిద్ధించును. అనఁగా మనస్సు పరమాత్మయందు లయించును.
షట్చక్రవేధము కర్తవ్య ముఖ్యోపాయము. మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపురము, అనాహతము. విశుద్ధము, ఆజ్ఞ యని క్రమముగా వాని పేళ్ళు, మూలాధారమునకుం బాయువు (మలవిసర్జన మార్గస్థానము), స్వాధిష్ఠానమున కువస్థము (మూత్రవిసర్జన శుక్రవిసర్జన స్థానము), మణిపురము నకు నాభి, అనాహతమునకు హృదయము. ఆజ్ఞకు భ్రూమధ్యము (కనుబొమల నడిమి భాగము) స్థానములై యున్నవి.
ఇది స్థూల వర్ణనమే, కాని యథార్థముగా నీ స్థానములు సుషుమ్న నాశ్రయించి యుండును. అనఁగా మూలాధారాది షట్చక్రములును సుషుమ్న నాశ్రయించి యున్నవి. సుషుమ్నయనంగా బ్రహ్మ బిలమునుండి వెనుకకు వ్యాపించియున్న మేదః పదార్థము గ్రీవయొక్క దిగువ భాగమునుండి నిర్మింపఁబడిన వంశనాళము-ఉంగరముల పేర్పును బోలియున్న వలయాకారాస్థుల పేర్పు, వెదురు బొంగు కనువులవంటి పేర్పు కలది కనుక వంశనాళ మనిపేరు. అందుఁ బాయుస్థానము వఱకు వ్రేలియుండు త్రాడువంటి పదార్థము నడుమ నున్న సూక్ష్మతమ మార్గము 'బిసతంతు తనీయసీ' - అనంగా తామరతూఁటి దారమువలె మిగుల సన్ననిదై యుండుటచే నటులు వర్ణింపం బడినది. అది పాయుస్థానము. అనఁగా గుదము వఱకు - వంశ నాళాంతమున నుండు త్రికముతోం (మూఁడెముకల కూర్పుతో) నంత మగును.
ఇప్పుడీ చక్రము లనెడి మూలాధారాద్యా జ్ఞాంతమైన యాఱును సుషుమ్నా మార్గమందే వ్యాపించి యుండును గనుక స్థూలముగా లింగమూల - నాభి - హృదయ - కంఠ - భ్రూమధ్య స్థానము లని చెప్పబడినను నీ చక్రస్థానములను సుషుమ్నా పథమందే ధ్యానింపవలయును. త్రికాంత ప్రదేశము నుండి మీఁదికి - మూలాధారమును, లింగమూలమున కెదురుగా - స్వాధిష్ఠానమును, నాభికెదురుగా - మణిపురమును, హృదయమున కెదురుగా - సనాహతమును, కంఠగర్తమున కెదురుగా - విశుద్ధమును, భ్రూమధ్యస్థానమున కెదురుగా - నాజ్ఞను ధ్యానింపవలయును. వీనికిం జక్రములు, పద్మములు, గ్రంథులు నని పేళ్ళు, వీని నన్నింటిని వేధించుకొనియే యనంగా దూసికొని పోవుటకే చక్రవేధ యని పేరు. స్థూలముగా సుషుమ్నాంతర్గత చక్రవర్ణన మిప్పటి కింతతోఁ జాలును. వాని వర్ణాది విశేషములను బనివడినప్పుడు తెలిసికొనవచ్చును.
మనోలయ - మాజ్ఞయందే యగును. ఆజ్ఞాచక్రమందుఁ బ్రాణము (చైతన్యము) సాధకుని ప్రయత్నముచే ననఁగాఁ జక్రవేధచేఁ జేరుకొన్నప్పుడే మనస్సు లయించును. 'మనస్సు లయించు' టనంగా సంకల్ప వికల్పము లణఁగిపోవుటే. అపుడే మనస్సునకు నేకాగ్రత కుదురును. అనఁగా స్వరూప జ్ఞానానుభవ మందు నిల్చును. పిమ్మట 'రాజయోగ' మనునది సహస్రార మందగును. ఈ ప్రాణ మనునది సహస్రారమునకుఁ జేరునపుడు 'రాజయోగ సిద్ధి యగు ననుట' సంకల్ప వికల్పములు లేకుండు టగును. మనస్సునకు నేకాగ్రతకలుగును; ఏదే నుద్దేశించుకొన్న సంకల్పితముపైఁ గూడ నేకాగ్రతయుః గలుగ వచ్చును. ఆపై సహస్రారమందు రాజయోగము కలుగును. ఆజ్ఞాచక్రముఁమీఁదికి (సహస్రారములోనికి) బ్రాణము చేరుట వలన నిది సిద్ధించును. సహస్రారమందు శక్తి బ్రహ్మమందు లయ మగుటచే 'నిర్బీజసమాధి' యను నవస్థ కలుగును. అనఁగాఁ బ్రాణ మనస్సులు రెండును లయించు ననుట.
అదే 'నేను' అనెడి ద్రష్టయొక్క స్వరూపానుభవ మగునని మున్నంటిని. ఇది పాతంజలదర్శన ప్రథమపాదమందలి మూఁడవసూత్రము. ఎంత దాఁక స్వస్వరూపావస్థానము కలుగదో (తన సత్య జ్ఞానానంద స్వరూపమందుఁ బ్రతిష్ఠ కలుగదో) యంతదాఁక వృత్తుల సరూపత హెచ్చు దగ్గులు గానే యుండును.
క్రింద నీయఁబడిన కఠవల్లీయ శ్రుతియు నీ పరమపద ప్రాప్తి కైన యుపదేశమునే చేయుచన్నది.
యచ్ఛేద్‌ వాజ్మనసీ ప్రాజ్ఞ స్తద్యచ్ఛేద్‌ జ్ఞాన ఆత్మని
జ్ఞాన మాత్మని మహతి నియచ్ఛేద్‌ తద్యచ్ఛే
చ్ఛాన్త ఆత్మని ||
-- కఠవల్లీ - 3-అ. మంత్ర-13.
బుద్ధిమంతుఁడైన మానవుఁడు వాగాదీంద్రియములను మనస్సు నందును, మనస్సును బుద్ధియందును, బుద్ధిని మహాత్తత్త్వమందును లయము చేసి, మహత్తత్త్వమును బ్రహ్మమందు లయము చేయును. శక్తి పాతక్రమమందుం బైనఁ జెప్పఁబడిన ప్రక్రియాసిద్ధి సుషుమ్నయందుఁ బ్రాణోత్థాన మగుటచే నగును.

Shaktipatamu    Chapters    Last Page